Site icon NTV Telugu

Indore Lady Smuggler Arrest: 32 ఏళ్ల కి’లేడి’ అరెస్ట్.. 12 కేసులు.. కోట్లల్లో ఆస్తులు

Indore Lady Smuggler Arrest

Indore Lady Smuggler Arrest

Indore Lady Smuggler Arrest: ఈమె సాధారణమైన లేడి అయితే తన గురించి చెప్పుకునే వాళ్లం కాదు. కానీ ఈమె అందరిలాంటి సాధారణ గృహిణి కాదు. కిలేడి.. నిజం అండీ బాబు ఆమెపై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడాదిన్నరగా పోలీసుల కళ్లుకప్పి తిరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె భర్త కూడా లిస్టెడ్ గుండా. ఎంతైనా భర్తకు తగ్గ భార్య అనిపించుకుంది. ఎన్ని రోజులని పోలీసులను మాయ చేసి తప్పించుకొని తిరుగుతుంది చెప్పండి. వాళ్లు ఇప్పటికే ఆమెను పట్టుకోవడం కోసం ఏడాదిన్నరగా ట్రై చేస్తున్నారు. ఈసారి మాత్రం అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దని గట్టిగా అనుకున్నట్లు ఉన్నారు. దెబ్బకు కిలేడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటీ కథ, ఎక్కడ జరిగింది, కిలేడి చేసిన నేరం ఏంటన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం…

READ ALSO: CloudBurst: అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?.. ముందుగా ఊహించడం కష్టమా?

స్మగ్లర్‌ సీమా నాథ్..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అహిర్ఖేడి ప్రాంతంలో సీమానాథ్ అనే 32 ఏళ్ల మహిళా స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. ఆమె ఇల్లు ఇండోర్‌లోని అహిర్ఖేడిలో ఉంది. పోలీసులు ఆ మహిళ ఇంటిపై దాడి చేసిన సమయంలో ఆమె తప్పించుకోడానికి ఇంట్లో పాములు, తేళ్లను వదిలింది. అయినా ఇండోర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ACP, TI సహా 18 మంది సభ్యుల బృందం ఆమెను చుట్టుముట్టారు. ఆమె వారి నుంచి తప్పించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి అరెస్ట్ కాక తప్పలేదు. ఈసందర్భంగా క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి నిందితురాలు సీమా నాథ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా, దాదాపు కోటి రూపాయల విలువైన 516 గ్రాముల బ్రౌన్ షుగర్, రూ.48 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మహిళ స్మగ్లర్ డబ్బును పిండి పెట్టెలు, బట్టలలో దాచిపెట్టిందని, తను దాదాపు ఏడాదిన్నరగా పరారీలో ఉందని తెలిపారు. సీమానాథ్ భర్త పేరు మహేష్ టోపి అని, అతను కూడా లిస్టెడ్ గూండా అని వెల్లడించారు. నిందితురాలిపై NDPS చట్టంతో సహా 12 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇంట్లో నుంచే దందా..
డీసీపీ రాజేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. నిందితురాలు ఎలక్ట్రానిక్ స్కేళ్లతో మాదకద్రవ్యాల ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేసేదని తెలిపారు. ఈ కిలేడి చాలా తెలివైనదని, దందాను తన ఇంటి నుంచే చేస్తుందని అన్నారు. తన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 23 కిలోల వెండి, 1 కిలో బంగారం, ఒక ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ మహిళ ఉండే ప్రాంతానికి ఒంటరిగా వెళ్లడానికి ఏ పోలీసు కూడా ధైర్యం చేయలేకపోయాడని, తన ఇంట్లో పాములు, తేళ్లు ఉండేవి సమాచారం.

READ ALSO: UP Family Suicide: నాలుగేళ్ల కొడుకును చంపి.. ఉరేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Exit mobile version