Site icon NTV Telugu

Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం తీసుకువచ్చిన త్రీటౌన్‌ పోలీసులు!

Borugadda Anil

Borugadda Anil

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం మూడో పట్టణ పీఎస్‌కు తరలించారు. ఇవాళ ట్రయల్‌ కోర్టు ముందు అనిల్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో బోరుగడ్డ అనిల్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి అనంతపురంకు పోలీసులు తీసుకోచ్చారు.

2018లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో Cr No 156/2018 u/s 419 186 506 ఐపీసీ కింద బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు అయింది. ఐఏఎస్ అధికారి నంటూ అప్పటి సీఐ మురళీకృష్ణను ఫోన్‌లో అనిల్‌ బెదిరించారు. రామచంద్రనగర్‌లోని చర్చ్ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ సీఐ మురళీకృష్ణపై ఆయన ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ కేసులో ఆయన వాయిదాలకు హాజరు కాలేదు. నేడు అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ట్రయల్‌ కోర్టు ముందు అనిల్‌ను హాజరుపరచనున్నారు.

Exit mobile version