Site icon NTV Telugu

Chhattisgarh : ఛత్తీస్‎గఢ్‎లో తుపాకుల మోత.. ముగ్గురు జ‌వాన్లు మృతి

Encounter

Encounter

Chhattisgarh : ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లా జ‌గ‌ర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. కుందేడ్ అట‌వీ ప్రాంతంలో భ‌ద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శ‌నివారం ఉద‌యం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో కొందరు జవాన్లు కూడా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమ‌రులైన జ‌వాన్లు ఏఎస్ఐ రామ్‌నాగ్, కానిస్టేబుల్ కుంజ‌మ్ జోగా, వంజం భీమాగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎదురుకాల్పులు జ‌రిగిన స‌మీప ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం బ‌ల‌గాల కూంబింగ్ కొన‌సాగుతోంది.

Read Also: Gudivada Amarnath: బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు.. మంత్రి అమర్నాథ్ అసహనం

Read Also: Preeti Health Bulletin: డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల.. నిమ్స్‌ వైద్యులు ఏం చెప్పారంటే

Exit mobile version