Site icon NTV Telugu

Oscar Nominations: భారతీయులకు మూడు ఆస్కార్ నామినేషన్స్!

Oscar Nominations

Oscar Nominations

Oscar Nominations: ఈ సారి భారతీయులకు ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” సాంగ్ ఎంత ఆనందం పంచిందో, అదే తీరున ‘ఆస్కార్ నామినేషన్’ సైతం సొంతం చేసుకొని మరింత ఉత్సాహాన్ని ఉరకలేయిస్తోంది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత దేశం నుండి ‘నాటు నాటు…’ సాంగ్ ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చోటు దక్కించుకోగా, దీంతోపాటు మన దేశానికే చెందిన శౌనక్ సేన్ తెరకెక్కించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ చిత్రం ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్” విభాగంలో నామినేషన్ పొందింది. అలాగే ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ రూపొందించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రం ‘డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ప్రస్తుతం మన ఇండియన్ సినీ ఫ్యాన్స్ దృష్టి ఈ మూడు విభాగాలపైనే సాగుతోంది. తప్పకుండా ఈ మూడు కేటగిరీల్లోనూ మన సినిమాలు సక్సెస్ సాధించాలని సినీ బఫ్స్ ఆశిస్తున్నారు.

Naatu Naatu: ఆస్కార్ బరిలో “నాటు… నాటు…” సందడి!

గతంలో మన దేశానికే చెందిన ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే చిత్రం కూడా ‘డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ’ విభాగంలోనే నామినేషన్ సంపాదించింది. అయితే విజేతగా నిలవలేకపోయింది. కానీ, ఈ సారి ఇండియన్ సినిమాపై పాశ్చాత్య దేశాల్లోనూ ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. కావున, మనవాళ్ళు సంపాదించిన ఈ మూడు కేటగిరీల్లోనూ భారతీయులు విజేతలుగా నిలిచే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

 

Exit mobile version