Site icon NTV Telugu

goods train derailed: పట్టాలు తప్పి వెయిటింగ్‌ హాల్లోకి దూసుకెళ్లిన గూడ్స్‌ రైలు.. ముగ్గురు మృతి

Goods Train

Goods Train

goods train derailed: ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని కొరీ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్‌ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం ఉదయం 6.44 గంటలకు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. రైలు భద్రక్ నుంచి కటక్‌కు వెళ్తుండగా.. మూడు నుంచి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు గూడ్స్‌ రైలు వెయిటింగ్ హాల్‌లోకి దూసుకెళ్లింది. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే స్టేషన్ భవనం కూడా దెబ్బతింది.

Fraud: పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండంటూ.. వందల కోట్లకు కుచ్చుటోపీ

రైల్వే స్టేషన్‌లో బలావోర్-భువనేశ్వర్ రైలు ఎక్కేందుకు అనేక మంది ప్రయాణికులు వేచి ఉండగా.. అక్కడి నుంచి వెళ్లే గూడ్స్‌ రైలు పట్టాల తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిందని జాజ్‌పూర్‌ ఎస్పీ రాహుల్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఒక చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల కింద ప్రజలు చిక్కుకుపోయారేమోనని తాము భయపడుతున్నామని.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని ఎస్పీ వెల్లడించారు. గూడ్స్ రైలు స్టేషన్ మీదుగా వెళ్లే సమయంలో వేగం తగ్గుతుందని, అయితే దాని వేగం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నిరాకర్ దాస్ మాట్లాడుతూ.. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు.

Exit mobile version