కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వ్యాధి భారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మందు లేని మాయ రోగం కావడంతో స్వీయ నియంత్రణే చికిత్స అన్నట్టుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత వ్యాక్సిన్స్ రావడంతో క్రమ క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేశారు. అయితే కొంతమంది మాత్రం కరోనా భయంతో లాక్ డౌన్ ఎత్తివేశాక కూడా ఇంట్లోనే తమను తాము బంధించుకున్న సంఘటనలు వెలుగుచూశాయి.
Also Read:India-Pakistan: నేడు పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్..
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి స్పెయిన్ లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కరోన భయంతో తమ ముగ్గురు పిల్లలను గత నాలుగేళ్లుగా ఇంట్లోని గదిలో బంధించారు. పోలీసుల ఎంట్రీతో పిల్లలకు విముక్తి కలిగింది. స్పేయిన్‌లో నివాసం ఉంటున్న ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇందులో 8 ఏళ్ల కవలలు, 10 ఏళ్ల వయసున్న మరో పిల్లవాడు ఉన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఇంట్లోనే లాక్‌డౌన్‌లో ఉంచబడిన 8 ఏళ్ల కవలలు మరియు 10 ఏళ్ల బాలుడు సహా ముగ్గురు జర్మన్ పిల్లలను స్పానిష్ పోలీసులు రక్షించారు.
Also Read:Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
పోలీసులు ఆ ఇంటిని “భయానక గృహం”గా అభివర్ణించారు. డిసెంబర్ 2021 నుంచి పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేదని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ఫేస్ మాస్క్‌లు ధరించమని బలవంతం చేశారని నివేదికలు వెల్లడించాయి. పిల్లలను రక్షించి, వారి తల్లిదండ్రుల మీద మానసిక వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వారి మానసిక స్థితిని మెరుగుపరచడానికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
