NTV Telugu Site icon

Kallakurichi Illicit Liquor: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి.. 70 మందికి చికిత్స..!

Tamilnadu

Tamilnadu

Kallakurichi Illicit Liquor: తమిళనాడు రాష్ట్రంలో కల్తీసారా ఘటన అత్యంత విషాదం గా మారింది. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు 29 మందికి చేరింది మృతుల సంఖ్య.. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన ప్రదేశానికి కల్లకురిచి జిల్లా కలెక్టరు, ఎస్పీ మీనాపై సర్కార్ వేటు వేసింది. కొత్తగా వచ్చిన కలెక్టరు ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేది పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సీఎం స్టాలి ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Astrology: జూన్ 20, గురువారం దినఫలాలు

ఇంకా వివిధ ఆసుపత్రిలో 70 మందికి పైగా మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చేబుతున్నారు. చికిత్స పోందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. గోవిందరాజు అనే వ్యక్తి కల్తీసారాను తయారు చేసి విక్రయించినట్లు గుర్తించారు. సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనాన్ని వినియోగించడం వల్లే మరణాలు.. ప్రజల ప్రాణాలు పోతున్న స్టాలిన్ ప్రభుత్వం మొద్దునిద్రు పోతుందంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కల్లకూరిచి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని.. తమిళనాడు రాష్ట్రం కల్తీసారాకు అడ్డాగా మారిందని మాజీ సీఎం పళణి స్వామీ విమర్శించారు.