29 MMTS Trains Cancelled in Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్ కారణాలతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు తమకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే రైళ్లు రద్దు అయ్యాయి.
లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), ఉందానగర్-సికింద్రాబాద్ (47246), ఉందానగర్- సికింద్రాబాద్ (47248), లింగంపల్లి-ఉందానగర్ (47212), సికింద్రాబాద్-ఉందానగర్ (47247), ఉందానగర్-సికింద్రాబాద్ (47248), సికింద్రాబాద్-ఉందానగర్ (47249), ఉందానగర్-లింగంపల్లి (47160), లింగంపల్లి-ఫలక్‌నుమా (47188), ఫలక్‌నుమా-లింగంపల్లి (47167), లింగంపల్లి-ఉందానగర్ (47194), లింగంపల్లి-ఉందానగర్ (47173) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Also Read: Coronavirus Cases: కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజే 104 కొత్త కేసులు నమోదు!
వీటితో పాటు రామచంద్రపురం-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-హైదరాబాద్, ఫలక్‌నుమా-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి తదితర రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఇక సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 20 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన విషయం తెలిసిందే. కాచిగూడ-కాకినాడ, హైదరాబాద్-తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు పలు తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.