తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందరిమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని తనకు పట్టిస్తే పార్టీ నుంచి రూ.25వేలు బహుమానంగా ఇప్పిస్తానని తెలిపారు.
Also Read:CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. హంటర్‌రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికైనా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు.
Also Read:Kadapa Crime: కువైట్ నుంచి వచ్చాడు అల్లుడిని హతమార్చాడు..! షాకింగ్ స్టోరీ..
అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఒర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
