Site icon NTV Telugu

Farmers Protest: సరిహద్దులో యుద్ధవాతావరణం.. కాల్పుల్లో రైతు మృతి

Farmars Died

Farmars Died

తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ (Chalo Delhi) చేపట్టిన రైతుల ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా (Farmers Protest) మారింది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి అన్నదాతలు అల్టిమేటం విధించారు. కానీ ఆ చర్చలు ఫలించకపోవడంతో కర్షకులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు కదం తొక్కారు. దీంతో రైతులను అదుపుచేసేందుకు హర్యానా పోలీసులు (Haryana Police Fires) టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో ఓ యువ రైతు (24) తలకు తగలడంతో మరణించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం రైతులు-పోలీసులు మధ్య తీవ్ర యుద్ధవాతారణం నడుస్తోంది.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13 నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కేంద్రం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బుధవారం 11 గంటలకు డెడ్‌లైన్ విధించారు. ఇది కూడా సక్సెస్ కాకపోవడంతో అన్నదాతలు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పరుగులు పెట్టారు. పోలీసులు అడ్డుకునే క్రమంలో 24 ఏళ్ల శుభ్ కరణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.

 

Exit mobile version