Rudransh Thakur: స్కూటర్ ముందు నిలబడి ఓ లుక్కిచ్చాడు అంతే.. బుడ్డోడి స్వాగ్‌కి నెటిజన్లు ఫిదా..

  • సోషల్ మీడియా సెన్సేషన్‌గా మహారాాష్ట్రకు చెందిన 23 నెలల రుద్రాంశ్..
  • దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న బుడ్డోడి వీడియో..
  • చిన్నారి స్వాగ్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
Rudransh Thakur

Rudransh Thakur

Rudransh Thakur:  మహారాష్ట్రకు చెందిన 23 నెలల బుడ్డోడు రుద్రాంశ్ ఠాకూర్ ఓవర్‌నైట్‌లో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. తల్లిదండ్రులు కొత్తగా కొనుగోలు చేసిన స్కూటర్ ముందు బేబుల్లో చేతులు పెట్టుకుని, కళ్లాద్దాలు ధరించి ఇచ్చిన లుక్ నెటిజన్లను కట్టిపారేస్తోంది. బుడ్డోడి స్వాగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను ముంచేత్తుతోంది. అనుకోకుండా సెలబ్రెటీగా మారాడు.

స్కూటర్ ముందు స్టైలిష్ ఫోజులు.

సోషల్ మీడియాలో ఏ విషయం ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతోందో తెలియదు. అలాంటి ఘటనే మహారాష్ట్ర యావత్మాత్ జిల్లాలో జరిగింది. 23 నెలల రుద్రాంశ్ ఠాకూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాడు. తల్లిదండ్రులతో కొత్త స్కూటర్ కొనుగోలు చేసేందుకు ఓ షోరూం ముందుకు వెళ్లిన అతను, అక్కడ కెమెరాకు ఇచ్చిన ఫోజులతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో సెలబ్రిటీగా మారిపోయాడు.

వైరల్ అవుతున్న వీడియోలో రుద్రాంశ్ ఓ స్కూటర్ ముందు నిలబడి కనిపిస్తాడు. కళ్లకు సన్‌గ్లాసెస్, స్టైలిష్ దుస్తులు, భుజాలపై సస్పెండర్లు ధరించి, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మోడల్‌లో ఫోజులిచ్చాడు. ఆ స్వాగ్‌ నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటోంది.

రుద్రాంశ్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని @bhonduuu_baccha పేజీలో షేర్ చేశారు. దీపావళి సందర్భంగా కుటుంబం కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు వెళ్లినప్పుడు ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీడియోకు 12.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 8 రోజుల్లోనే 11 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి. దాదాపు 90 లక్షల లైక్స్ వచ్చాయి. రుద్రాంశ్ లుక్, స్టైల్ కారణంగా అందరూ అతడిని ‘చోటా డాన్’ అని ముద్దుగా పిలుస్తున్నారు. హోండా కొత్త చైర్మన్ వచ్చాడంటూ కామెంట్స్ చేస్తు్న్నారు.

రుద్రాంశ్ చదువు ఖర్చులు భరిస్తానన్న షోరూం యజమాని.?

రుద్రాంశ్ వీడియో వైరల్ కావడంతో మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోరూం యజమాని రుద్రాంశ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అతడి నర్సరీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చుల్ని భరిస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్క ఫోజుతో మారిపోయిన గుర్తింపు..

కొన్ని రోజుల వరకు ఇంటి చుట్టుపక్కల వారికి , బంధువులకు మాత్రమే తెలిసిన రుద్రాంశ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాడు. రుద్రాంశ్ తనకు తానుగానే ఈ ఫోజు ఇచ్చినట్లు అతడి తల్లి వెల్లడించారు. షోరూం ముందు చిన్న వీడియో ఇంత సంచలనం కలిగిస్తుందని తాము ఊహించలేదని చెబుతున్నారు.