Site icon NTV Telugu

కొత్త లుక్‌, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125 లాంచ్.. ధర ఎంతంటే..!

2026 Bajaj Pulsar 125

2026 Bajaj Pulsar 125

2026 Bajaj Pulsar 125 launch: బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో మోటార్‌సైకిల్ లైనప్‌ను 2026 మోడళ్లతో అప్డేట్ చేస్తోంది. ఇందులో భాగంగా 2026 బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar)ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో స్టైలింగ్ అప్‌డేట్స్‌తో పాటు LED హెడ్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లు అందించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.

PhonePe IPO: పేటీఎం రికార్డులు బ్రేక్ అవుతాయా? ఫోన్‌పే ఐపీఓకు లైన్ క్లియర్..

ఈ మోడల్‌లో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా కొత్త LED హెడ్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లు అందించారు. ఇవి రాత్రి ప్రయాణంలో మరింత మెరుగైన వెలుతురును ఇవ్వనున్నాయి. ఈ హెడ్‌లైట్ డిజైన్ పల్సర్ 150లో చూసిన డిజైన్‌ను పోలి ఉంటుంది. అలాగే కొత్త కలర్ ఆప్షన్లు, అప్డేటెడ్ గ్రాఫిక్స్‌తో బైక్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. అయితే ఈ మార్పులు పల్సర్ 125 నియాన్ బేస్ వేరియంట్‌కు వర్తించవు.

ఇంజిన్, హార్డ్‌వేర్ పరంగా పల్సర్ 125 యథాతథంగా కొనసాగుతోంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు, బ్రేకింగ్ కోసం ముందు 240mm డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ అందించారు. ఈ బైక్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో.. రైడర్‌కు పలు స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

Tollywood: బాక్సాఫీస్ సునామీ: 10 రోజులు – 5 సినిమాలు – 800 కోట్లు!

2026 బజాజ్ పల్సర్ 125లో 124.4cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11.8 Hp పవర్ @ 8,500 rpm, 10.8 Nm టార్క్ @ 6,500 rpm ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 89,910 (ఎక్స్-షోరూమ్) కాగా.. 2026 పల్సర్ 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కార్బన్ సింగిల్ సీట్ వేరియంట్ రూ. 89,910 కాగా, కార్బన్ స్ప్లిట్ సీట్ వేరియంట్ రూ. 92,046 గా ఉంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రెండు వేరియంట్లు కూడా గత మోడళ్లతో పోలిస్తే రూ. 2,400 తక్కువ ధరకు లభిస్తున్నాయి.

Exit mobile version