2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 Nobel Prize Physics: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వరించింది. “ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ”కు శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌లకు 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చినట్లు మంగళవారం నోబెల్ కమిటి తెలిపింది. జాన్‌క్లార్క్, మిచెల్‌హెచ్.డివోరెట్, జాన్.ఎం మార్టిన్స్‌లు ముగ్గురు ఈ అవార్డను సంయుక్తంగా గెలుచుకున్నారు.
READ ALSO: Kaleshwaram Commission : కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా.. వారికి మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. బహుమతి గెలుచుకున్న ముగ్గురికి మొత్తం 11 మిలియన్ స్వీడిష్ కిరీటాల ($1.2 మిలియన్లు) బహుమతి రానుంది. ఈ మొత్తాన్ని వాళ్లు ముగ్గురు పంచుకోనున్నారు. ఇప్పటికే తొలి నోబెల్ బహుమతి వైద్య రంగంలో ముగ్గురు వైద్యులకు సంయుక్తంగా లభించింది. మిగిలిన విభాగాల్లో నోబెల్ బహుమతుల విజేతల పేర్లను అక్టోబర్ 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ రంగాలలో బహుమతులను అందజేయడానికి వీలునామా రాశారు. 1895 నాటి ఆయన వీలునామా ప్రకారం.. “గత ఏడాదిలో, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి” బహుమతులు ప్రదానం చేయాలని ఆయన నిర్దేశించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. నాటి నుంచి ఏటా అందజేస్తున్నారు. అప్పటి నుంచి కొన్ని సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగిన సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.
READ ALSO: Lashkar-E-Taiba ISKP Alliance: పాక్ ఐఎస్ఐ కొత్త కుట్ర.. భారత్‌కు ప్రమాదం పొంచి ఉందా!
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!