Site icon NTV Telugu

890cc ఇంజన్, మరిన్ని క్రేజీ ఫీచర్స్ తో 2025 Ducati Panigale V2 లాంచ్.. ధర ఎంతంటే?

2025 Ducati Panigale V2

2025 Ducati Panigale V2

2025 Ducati Panigale V2: ప్రసిద్ధ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్‌లో కొత్త పానిగాలే V2, పానిగాలే V2 S (2025 Ducati Panigale V2) మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు బైక్‌లు పాత పానిగాలే ట్విన్ మోడల్‌ను భర్తీ చేయనున్నాయి. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్‌, కొత్త ఛాసిస్‌, అలాగే అధునాతన ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫామ్‌తో ఈ బైక్‌లు రైడర్లకు మరింత రైడింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. వీటి ఇంజిన్ విషయానికి వస్తే.. 2025 పానిగాలే V2లో 890cc సామర్థ్యమున్న 90° V2 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 10,750rpm వద్ద 120hp శక్తిని, 8,250rpm వద్ద 93.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 54.4 కిలోల బరువు కలిగిన ఈ ఇంజిన్ డుకాటి తయారు చేసిన ట్విన్ సిలిండర్ ఇంజిన్లలోకెల్లా తేలికైనదిగా గుర్తింపు పొందింది.

Baahubali The Epic : అది బాహుబలి 3 కాదు.. రాజమౌళి షాకింగ్ స్టేట్ మెంట్

కొత్త పానిగాలే V2 లో మోనోకోక్ ఫ్రేమ్ సెటప్ అమర్చారు. ఇందులో ఇంజిన్ స్ట్రెస్డ్ మెంబర్‌గా పనిచేస్తుంది. పానిగాలే V4 నుండి తీసుకున్న డబుల్ సైడెడ్ స్వింగ్‌ ఆర్మ్ దీనికి మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్‌లో పానిగాలే V2 లో 43mm మార్జోచి ఫోర్క్, కాయబా షాక్ అబ్జార్బర్ ఉంటే.. V2 S వేరియంట్‌లో మాత్రం ప్రీమియం ఓహ్లిన్స్ NIX-30 ఫ్రంట్ ఫోర్క్‌లు, ఓహ్లిన్స్ రియర్ షాక్‌లు అమర్చారు. బ్రేకింగ్ విషయంలో కూడా డుకాటి ఎలాంటి రాజీ పడకుండా.. రెండు వేరియంట్లలో బ్రిమ్బో కాలిపర్‌లు ఉపయోగించగా.. V2 S లో మరింత M50 మోనోబ్లాక్ యూనిట్లు ఉన్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీ కారణంగా V2 S బరువు కేవలం 175 కిలోలు మాత్రమే ఉండగా, సాధారణ V2 బరువు 179 కిలోలుగా ఉంది.

Rohit Sharma: కమ్ బ్యాక్ అంటే ఇది కదరా.. మొదటిసారి ‘టాప్’ లేపిన హిట్ మ్యాన్..!

డిజైన్ పరంగా కొత్త పానిగాలే V2 పానిగాలే V4 స్టైలిష్ లుక్ ను అనుసరిస్తుంది. ఇందులో ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌లు, DRL లైట్లు, సీటుతో కలిపిన టెయిల్ సెక్షన్, తిరిగి వచ్చిన అండర్-సీట్ ఎగ్జాస్ట్ లేఅవుట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 6-యాక్సిస్ IMU ఆధారంగా పనిచేసే అత్యాధునిక సిస్టమ్‌లో కార్నరింగ్ ABS, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, డుకాటి క్విక్ షిఫ్ట్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. V2 S మోడల్‌లో అదనంగా డుకాటి పవర్ లాంచ్, పిట్ లిమిటర్ ఫీచర్లు కూడా లభిస్తాయి. రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి 5-అంగుళాల ఫుల్-TFT డిస్‌ప్లే, అలాగే రేస్, స్పోర్ట్, రోడ్, వెట్ అనే నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర పరంగా చూస్తే.. పానిగాలే V2 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 19.11 లక్షలు కాగా.. పానిగాలే V2 S ధర రూ. 21.09 లక్షలు. ఈ రెండు వేరియంట్లు డుకాటి రెడ్ కలర్‌లో మాత్రమే లభిస్తాయి. భారతదేశంలోని డీలర్‌షిప్‌ల ద్వారా 2025 జనవరి నెలాఖరు నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version