బజాజ్ ఆటో భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ-వీలర్ తయారీ సంస్థలలో ఒకటి. తాజాగా బజాజ్ ఆటో తన ప్రసిద్ధ స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ 2025 బజాజ్ డొమినార్ 250, డొమినార్ 400 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ అనేక ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఎర్గోనామిక్స్, టూరింగ్ సామర్థ్యాలను మరింత ఆకర్షణీయంగా మార్చే సాంకేతిక అప్‌గ్రేడ్‌లతో వస్తున్నాయి. సుదూర రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేయడానికి అనేక ఎర్గోనామిక్ మార్పులు చేశారు. రెండు బజాజ్ బైక్‌ల ధరలు డామినార్ 400 రూ. 2,38,682 (ఎక్స్-షోరూమ్), డామినార్ 250 రూ. 1,91,654 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
Also Read:Toll Charges: వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న టోల్ ఫీజులు
2025 బజాజ్ డొమినార్ 400
ఇది అనేక అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు. దీనికి రైడ్-బై-వైర్ టెక్నాలజీ ఉంది. బైక్‌కు ఎలక్ట్రానిక్ థ్రోటిల్ బాడీ ఇచ్చారు. నాలుగు రైడింగ్ మోడ్‌లు అందించారు – రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. మీరు వేర్వేరు రోడ్లకు అనుగుణంగా మోడ్‌ను మార్చవచ్చు. ఇది బాండెడ్ గ్లాస్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దానిపై అవసరమైన అన్ని సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త ఎర్గోనామిక్ హ్యాండిల్‌బార్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ GPS మౌంట్, అధునాతన నియంత్రణ స్విచ్‌లు వంటి ఫీచర్లు అందించారు.
Also Read:AP Capital: రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభ.. ఎమ్మెల్యే, అధికారులకు నిరసన సెగ
2025 బజాజ్ డామినార్ 250
ఈసారి డొమినార్ 250 లో చాలా మార్పులు చేశారు. ఇందులో కూడా డొమినార్ 400 లాగా నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. కానీ ఇందులో నాలుగు ABS-ఎనేబుల్డ్ రైడ్ మోడ్‌లు ఉన్నాయి. దీనిని టూరింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మిగతా అన్ని ఫీచర్లు డొమినార్ 400 లో ఉన్నట్లే ఉన్నాయి.
