NTV Telugu Site icon

BMW 5 Series LWB: భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..

Bmw 5 Series Lwb

Bmw 5 Series Lwb

BMW 5 Series LWB: జర్మన్ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ భారతదేశంలో కొత్త 5 -సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌ ను విడుదల చేసింది. ఈ వాహనం రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ ను పొందిన మొదటి మార్కెట్ భారతదేశం. బిఎండబ్ల్యూ 5 సిరీస్ LWB 4 రంగులలో కారును అందించబడుతుంది. మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, M కార్బన్ బ్లాక్, స్పార్క్లింగ్ కాపర్ గ్రే లలో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే దీని వీల్‌బేస్ 110mm లు 3,105mm లకు పెరిగింది. ఇది Mercedes-Benz E-Class LWB తో పోటీపడుతుంది. ఈ కార్ సంబంధించి బుకింగ్‌లు గత నెలలోనే ప్రారంభమయ్యాయి.

Aqua Line: ముంబైలో మొదలైన మొదటి భూగర్భ మెట్రో..

కొత్త 5-సిరీస్ LWB పెద్దగా ఉండే ఫ్రంట్ గ్రిల్, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, హాఫ్‌ మీస్టర్ కింక్‌ పై ‘5’ చిహ్నం, కొత్త అల్లాయ్ వీల్స్, ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్‌ లతో కూడిన బంపర్‌ను కలిగిఉంది. కారు ప్రీమియం క్యాబిన్ గ్రే లేదా బ్రౌన్ కలర్ సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇక డాష్‌ బోర్డ్‌ లో యాంబియంట్ లైటింగ్ అందించబడింది. ఇది కాకుండా., 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14.9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, హెడ్ అప్ డిస్‌ప్లే, సిగ్నల్ నియంత్రణ, 18 స్పీకర్ బోవర్స్ & విల్కిన్స్ సరౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?

5-సిరీస్ LWB 530Li M స్పోర్ట్ వేరియంట్‌లో కొత్తగా జత చేయబడింది. ఇది 258ps శక్తిని ఉత్పత్తి చేసే మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 2 – లీటర్ టర్బో -పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడింది. భద్రత కోసం, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, 360 – డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఈ లగ్జరీ కారు ధర రూ. 72.9 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఇది Audi A6, Volvo S90 లకి పోటీగా ఉంటుంది.