NTV Telugu Site icon

Microsoft Outage: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..వివరాలకు ఇక్కడ సంప్రదించండి..

Flights

Flights

మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇది భారత విమానయాన సేవలపై కూడా పెద్ద ప్రభావం చూపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ మరియు స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు వివిధ సాంకేతిక లోపాలను చవిచూశాయి. స్లో చెక్-ఇన్‌లు, విమానాశ్రయాలు, సంప్రదింపు కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

READ MORE: Microsoft Outage Live Updates : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్

తాజాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం కారణంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వివరించింది. ఫ్లైట్‌ రీబుక్ లేదా రీఫండ్‌ను క్లెయిమ్ చేసే ఆప్షన్‌ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదని వెల్లడించింది. రద్దయిన విమానాల వివరాలను తెలుసుకునేందుకు https//bit.ly/4d5dUcZ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి దాదాపు 192 విమానాలు రద్దయ్యాయి.

READ MORE: Allu Aravind: మీ బామ్మర్దితో సినిమా చేస్తున్నామని ఎన్టీఆర్ కి ఫోన్.. షాకింగ్ సమాధానం!

కాగా.. మైక్రోసాఫ్ట్ వినియోగదారులు Microsoft 360, Microsoft Windows, Microsoft Team, Microsoft Azure, Microsoft Store మరియు Microsoft క్లౌడ్-ఆధారిత సేవలను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 74 శాతం మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి లాగిన్ అవ్వడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, 36 శాతం మంది ప్రజలు యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీకి సంబంధించిన ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.