Site icon NTV Telugu

Little Man Marriage: 2.5 అడుగుల వ్యక్తి.. కల నెరవేర్చుకున్నాడు..

Little Man Marriage

Little Man Marriage

Little Man Marriage: పెళ్లి చేసుకోవాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి సంబంధం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పెళ్లి కూతురు కోసం తెలిసిన చోటల్లా ఆరా తీశాడు. అడగాల్సిన వారందరినీ అడిగాడు. అయినా వివాహం కాలేదని ఆందోళనకు గురయ్యాడు. అతడి పెళ్లికి ప్రధాన ఆటంకం ఎత్తు. కేవలం 2.5 అడుగుల ఎత్తు ఉండటంతో ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. ప్రస్తుతం తన పెళ్లి కుదరడంతో మనోడు గాల్లో తేలుతున్నాడు. గాల్లో తేలివోయిన ఆ వ్యక్తి వివాహం ఇవాళ జరిగింది. యూపీలోని షామ్లి జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరి ఓ ఇంటి వాడయ్యాడు.

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని కైరానాలో నివాసం ఉంటున్న ముప్పై రెండేళ్ల అజీమ్ మన్సూరి, హాపూర్ నివాసి బుష్రాతో బుధవారం వివాహం చేసుకున్నారు. తన పెళ్లి విషయమై పలుమార్లు రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించాడు. 2019లో, అతను తనకు వధువును కనుగొనడంలో సహాయం చేయడానికి అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కూడా సంప్రదించాడు. ఇప్పుడు అతని కల నిజమైంది. దేవుని దయతో ఈ క్షణం తన జీవితంలోకి వచ్చిందని అతను తెలిపాడు. ఈ సంతోషకరమైన సందర్భంలో తాను అందరినీ ఆహ్వానించినట్లు చెప్పాడు. తన పెళ్లికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను కూడా ఆహ్వానించినట్లు తెలిపాడు. సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

PM Narendra Modi: కర్ణాటక ‘డబుల్‌ ఇంజిన్‌’ ఇతర దేశాలకు సవాల్‌ విసురుతోంది..

మన్సూరి వివాహం నేపథ్యంలో ఇంటి వద్ద రద్దీని నియంత్రించడానికి స్థానికులు పోలీసులను పిలిచారు. అజీమ్ తనకు వధువును చూసి పెట్టమంటూ పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగానని చెబుతున్నాడు. అంతేకాదు, 2019లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలిసి, తనకు సంబంధం చూడాలని కోరానన్నాడు. నజీమ్ ఏళ్ల తరబడి ఆరాటం, పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

Exit mobile version