Site icon NTV Telugu

1965 India Pakistan War: 1965 యుద్ధంలో పాక్ ఓటమి వెనుక అసలైన కారణాలు బయటపెట్టిన వీర్ చక్ర అవార్డు గ్రహీత..

Pakistan Defeat 1965 War

Pakistan Defeat 1965 War

1965 India Pakistan War: 1965 యుద్ధానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యుద్ధంలో వీర్ చక్ర అవార్డు పొందిన ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సతీష్ నంబియార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా నంబియార్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమికి దాయది అపార్థాలే కారణమని అన్నారు. ముఖ్యంగా పాక్ మూడు అపార్థాలతో ఈ యుద్ధంలో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

READ ALSO: Teja Sajja : మూడు సీక్వెల్స్.. అప్డేట్లు ఇచ్చిన తేజ

అపోహలు ఓటమికి దారి తీశాయి..
ఆయన మాట్లాడుతూ.. ఆ సమయంలో భారతదేశం సాయుధ దళాల గురించి పాకిస్థాన్‌కు మూడు అపోహలు ఉన్నాయని చెప్పారు. చైనాపై ఓటమి తర్వాత భారత దళాలు నిరాశకు గురయ్యాయని పాక్ విశ్వసించిందని, కాశ్మీర్ ప్రజలు తమకు మద్దతు ఇస్తారని, అఖ్నూర్‌పై దాడి చేయడం ద్వారా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కాశ్మీర్ రహదారి సంబంధాన్ని సులభంగా తెంచవచ్చని నమ్మిందని పేర్కొన్నారు.

1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓడిపోయిన తర్వాత, భారత్ దళాలు నిరాశకు గురయ్యాయని, సైనికుల మనోధైర్యం దెబ్బతిన్నదని పాకిస్థాన్ భావించింది. కానీ ఇది పాకిస్థాన్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పును అని ఆయన పేర్కొన్నారు. భారత సైన్యం చాలా ప్రతికూల పరిస్థితులలో, పరిమిత వనరులతో చైనాతో పోరాడిందని చెప్పారు. ఆ సమయంలో భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి పాత ఆయుధాలను కలిగి ఉందని, అలాగే సైనికులకు అవసరమైన యూనిఫాంలు కూడా సైన్యం వద్ద లేవు అని నంబియార్ చెప్పారు. భారత సైనికుల ధైర్యం ముందు పాక్ సైనికులు నిలబడలేకపోయారని అన్నారు.

కాశ్మీర్ ప్రజల విషయంలో పొరపాటు..
కాశ్మీర్ ప్రజలను అంచనా వేయడంలో పాక్ విఫలమైందని ఆయన చెప్పారు. “కాశ్మీర్ ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా పాక్‌కు మద్దతు ఇస్తారని దాయాది భావించింది. కానీ కాశ్మీర్ ప్రజలు భారత సైనికులకు మద్దతు ఇచ్చారు. పాకిస్థాన్ సైన్యం గురించి సకాలంలో, కీలకమైన సమాచారాన్ని అందించారు. ఇది యుద్ధంలో ప్రయోజనకరంగా మారడంతో పాటు విజయంలో కీలక పాత్ర పోషించింది” అని ఆయన పేర్కొన్నారు. అఖ్నూర్‌పై దాడి చేయడం ద్వారా కాశ్మీర్‌కు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఉన్న రోడ్డు మార్గాలను తెంచవచ్చని పాక్ ఆలోచించింది. అయితే వాళ్లు తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించిన ఆపరేషన్ గిబాల్తార్ విఫలమైందని చెప్పారు. నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి శత్రువులకు కఠినమైన గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

READ ALSO: Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !

Exit mobile version