Site icon NTV Telugu

Operation Sindoor: దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్.. 17 మంది నవజాత బాలికలకు ‘సింధూర్’ అని నామకరణం

Up

Up

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ప్రజలకు బాగా నచ్చుతోంది. వారు తమ కూతుళ్లకు సింధూర్ అని పేరు పెడుతున్నారు. దేశ భక్తిని చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. కుషినగర్ జిల్లాలో, మే 7 తర్వాత ఓ హాస్పిటల్ లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది బాలికలకు వారి తల్లిదండ్రులు సింధూర్ అని పేరు పెట్టారు. దేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ద్వారా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పాయి.

Also Read:Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్

కుషినగర్‌లో, ప్రజలలో దేశభక్తి స్ఫూర్తి పరాకాష్టలో ఉంది. దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్నప్పుడు, ఆ కాలంలో పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు తమ కుమార్తెలకు సింధూర్ అని పేరు పెట్టారు. మహిళలు దేశ సరిహద్దులకు వెళ్లి పోరాడకపోయినా, తమ నవజాత కుమార్తెలకు సింధూర్ అని పేరు పెట్టడం వారి దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత సింధూర్ అనేది ఒక పదం కాదు, ఒక అనుభూతి అని బంధువులు అంటున్నారు. అందుకే మా కూతురికి సింధూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Also Read:Train Accident: సెల్‌ఫోన్‌.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది!

నగరానికి చెందిన మదన్ గుప్తా కోడలు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. భారత దళాల ఆపరేషన్ సింధూర్ విజయంతో ప్రేరణ పొంది, దేశభక్తి స్ఫూర్తితో తన మనవరాలికి సింధూర్ అని పేరు పెట్టానని ఆయన అన్నారు. సదర్ తహసీల్ ప్రాంతంలోని ఖాన్వర్ బక్లోహి గ్రామానికి చెందిన నేహా మే 9న ఆడపిల్లకు జన్మనిచ్చింది. నేహా తన కూతురికి సింధూర్ అని పేరు పెట్టింది. భాతి బాబు గ్రామంలో నివసించే వ్యాస్ ముని భార్య కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. వారు తమ కూతురికి సింధూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖడ్డా తహసీల్ ప్రాంతంలోని భేడిహరి గ్రామానికి చెందిన అర్చన మాట్లాడుతూ, మా కూతురికి సింధూర్ అని పేరు పెట్టడం మాకు గర్వకారణమని అన్నారు. ఖడ్డా ప్రాంతానికి చెందిన రీనా తన కూతురికి సింధూర్ అని పేరు పెట్టింది.

Also Read:Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్

పద్రౌనాలోని నహర్ చాప్రా గ్రామంలో నివసించే ప్రియాంక కూడా నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తన కుమార్తెకు సింధూర్ అని పేరు పెట్టింది. ఈ విధంగా, మే 7 నుంచి 9 వరకు, మొత్తం 17 మంది బాలికలు జన్మించారు, వారికి సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో ప్రేరణ పొంది వారికి సింధూర్ అని పేరు పెట్టారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి అన్నారు.

Exit mobile version