Mexico Prison Attack: మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం రేపాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లోని జైలుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. మరో 25 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ముష్కరులు వాహనంపై ఆదివారం ఉదయం 7 గంటలకు జైలుకు వచ్చి కాల్పులు జరిపారని చెప్పారు. కుటుంబ సభ్యులు తమవారిని కలవడానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పెనిటెన్షియరీ సెంటర్‌కు వాహనాల్లో వచ్చిన సాయుధులు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారు. బంధువుల గందరగోళం, భయాందోళనలో 24 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారని రిఫార్మా గతంలో నివేదించింది. తప్పించుకున్న వారిలో ఎల్‌నెటో నాయకుడుగా పిలువబడే ఎర్నెస్టో ఆల్ఫ్రెడో పినాన్ ఉన్నారు.
Tragedy: కుమార్తె బాధ భరించలేక.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి
సాయుధులను వెంబడించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ దాడికి సమయం ముందే పోలీసులు.. ఎస్యూవీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ముష్కరులను హతమార్చారు. కాగా, గత ఆగస్టులో ఇదే జైలులో అల్లర్లు చెలరేగాయి. అవి జుయారెజ్ వీధుల్లోకి వ్యాపించాయి. ఈ హింసలో 11 మంది మరణించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు సైతం హత్యకు గురయ్యారు.