Road Accident: పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాన్‌చాంగ్ కౌంటీలో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలపై లోతైన విచారణ జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది.
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
వార్త వెలువడిన ఒక గంట తర్వాత నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారీగా పొగమంచు కమ్మేసిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. “దయచేసి ఫాగ్ లైట్లపై శ్రద్ధ వహించండి… వేగాన్ని తగ్గించండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ముందు ఉన్న కారు నుంచి సురక్షితమైన దూరం ఉంచండి, పాదచారులను నివారించండి, లేన్‌లను మార్చవద్దు, ఓవర్‌టేక్ చేయవద్దు” అని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం వల్ల చైనాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం.