NTV Telugu Site icon

Turtles Seized: అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!

Turtles Seized

Turtles Seized

Illegal Turtles Transportation in Alluri Sitharama Raju District: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1589 తాబేళ్లను కోనసీమ జిల్లా రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా మినీ వ్యాన్‌లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఫోక్స్ పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని రేంజ్ అధికారి కరుణాకర్ పట్టుకున్నారు. పట్టుబడ్డ వాహనంలో మినీ వ్యాన్‌లో 30 బస్తాల్లో సుమారు 1600 వరకు తాబేళ్లు ఉన్నాయని కరుణాకర్ చెప్పారు. ఆ తాబేళ్ల విలువ సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

Show comments