Organs Theft: సామాన్యులు ఆస్పత్రులను దేవాలయాలు.. డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు. అలాంటి వారే వారి పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ఇటీవల వైద్యం అంటే భారీ వ్యాపారంగా మారిపోయింది. కొందరు డాక్టర్లు స్వార్థంలో పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బతికున్న వారితోనే కాకుండా చనిపోయిన శవాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. అపెండిసైటిస్‌కు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. 24వ తేదీన బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26వ తేదీన బాలిక చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
Read Also: Budget 2023: సొంతిల్లు లేనివారికి గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు
దీంతో బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక శరీరాన్ని పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ పేరుతో తమ కూతురు అవయవాలను తీసుకున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడుతూ..బాలిక మృతదేహాన్ని జనవరి 31న పోస్ట్ మార్టం జరిపించామని..ఆ రిపోర్టు వస్తే బాలిక మరణానికి కారణమేంటనేది తెలుస్తుందని ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
