NTV Telugu Site icon

TERRORIST ATTACK: రష్యా డాగేస్తాన్‌లో ప్రార్థనా స్థలాలపై రెచ్చిపోయిన ముష్కరుల దాడి(వీడియో)

Maxresdefault (12)

Maxresdefault (12)

రష్యాలో డాగేస్తాన్ నగరాల్లో అగంతకులు పాల్పడిన తీవ్రవాద ఘటనలో, రెండు చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు మరియు పోలీసుల చెక్ పోస్ట్ పై కాల్పులు చేసారు . ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. కాగా భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 6 గురు అగంతకులు హతమయ్యారు. మఖచ్ కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యం చేసి కాల్పులు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ ముగిసిందని రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది.
YouTube video player