Shocked Woman: ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోవాలంటే భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులివి. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆడవారు తమ భర్తలకు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఇళ్లువదిలి ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఆసరాగా ఉండాల్సిన యాజమాని ఆమెను సడన్ గా ఉద్యోగం నుంచి తీసేయడంతో షాక్ కు గురైంది. అది తను తప్పు చేసినందుకు కాదు. తల్లి కాబోతున్నాను అని గుడ్ న్యూస్ చెప్పినందుకు.. రీజన్ కాస్త సిల్లిగా ఉందనుకుంటున్నారు కాదా.. కానీ ఇక్కడో కారణం ఉంది. దాని మూలంగా యజమాని ఆమెను తీసేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.. ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆమెకు రూ.15కోట్లు ఫైన్ విధించింది.
Read Also: Vande Bharat Express : హౌరా రైల్వే స్టేషన్‌లో హైడ్రామా.. అసహనం వ్యక్తం చేసిన సీఎం
ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో ఉన్న కంపెనీలో షార్లెట్ లీచ్ అనే మహిళ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్లో జాబ్ చేస్తోంది. ఆమె గర్భవతి అని తెలియగానే ఆ విషయం తన యజమానితో పంచుకుంది. తనకు గతంలో గర్భస్రావం జరిగిందని.. ప్రస్తుతం తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందంటూ ఆవేదనను యజమానికి తెలుపుకుంది. తన జాయిన్ అయినప్పుడు చేసిన ఒప్పందం ప్రకారం సెలవు ఇవ్వడం కుదరని యజమాని తెగేసి చెప్పాడు. దీంతో ఆమెను తీసేస్తున్నట్లు లెటర్ ఇచ్చాడు. షార్లెట్ తన ఉద్యోగం కోల్పోయిన కొద్ది రోజులకే తన బిడ్డను కూడా కోల్పోయింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. తర్వాత, కోర్టు షార్లెట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 14,885 పౌండ్లు లేదా 14,86,856 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.