Site icon NTV Telugu

Congo: తీవ్ర విషాదం.. నదిలో పడవ బోల్తా.. 148 మంది మృతి

Cango

Cango

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా నివేదికలు శుక్రవారం తెలిపాయి. మటాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్‌బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో మంటలు చెలరేగాయి.

Also Read:Drishyam 3 : పాన్‌ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాదాపు 100 మందిని స్థానిక టౌన్ హాల్‌లోని తాత్కాలిక ఆశ్రయానికి తరలించినట్లు స్కై న్యూస్ నివేదించింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులలో చేర్చారు. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కాంగోలోని గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుంటారు. దీంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 2023లో, కాంగోలో ప్రయాణిస్తున్న పడవ ఈక్వేటర్‌లో మునిగిపోవడంతో కనీసం 47 మంది మరణించారు.

Exit mobile version