NTV Telugu Site icon

ట్విట్టర్ లో యాడ్.. 14 లక్షల సైబర్ మోసం

సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఓ యాడ్ చూసి.. 14 లక్షల సైబర్ మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కి చెందిన రాహుల్ ను ట్విట్టర్ లో ఓ యాడ్ ఆకర్షించింది. నీల్ పటేల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ యాడ్ చూసి.. అధిక లాభాలు వస్తాయని 14 లక్షల క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టాడు. గుజరాత్ కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఆ యాడ్ ఆకర్షించింది. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయానని రాహుల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ తరహా యాడ్ ల ద్వారా నిందితులు 10 కోట్ల రూపాయలకు పైగా మోసాలు చేసినట్లు సమాచారం. ఈ తరహా మోసాలపై ఇప్పటికే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధులలో కేసులు నమోదు చేసామని సైబర్ పోలీసులు తెలిపారు.