HanuMan : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేళ బంపర్ ఆఫర్ ప్రకటించిన హనుమాన్ టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు (జనవరి 22) న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీనితో దేశమంతా రామ నామంతో మారుమ్రోగిపోతుంది. ఈ సందర్బంగా హనుమాన్ మూవీ మేకర్స్ అమెరికాలో ఓ బంపర్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు.ఈ మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అయిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ మరియు నిర్వాణ సినిమాస్ అక్కడి కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.హనుమాన్ మూవీ ఆడుతున్న 11 థియేటర్లలో సోమవారం (జనవరి 22) అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టికెట్ల తగ్గింపు అందుబాటులో ఉంటుందని వాళ్లు తెలిపారు. అది కూడా కేవలం కౌంటర్ల దగ్గర నేరుగా టికెట్లు కొనేవారికి మాత్రమే ఈ సగం ధరకు టికెట్లు లభిస్తాయి. ఆన్‌లైన్ బుకింగ్ కు ఆ అవకాశం లేదని తెలిపారు.అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆపిల్ సినిమాస్ తోపాటు రెండు చోట్ల సినీలాంజ్ మరియు ఒక చోట బీ అండ్ బీ థియేటర్స్ ఈ ఆఫర్ ఇస్తోంది. మొత్తంగా 11 చోట్ల ఇస్తున్న ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ డిస్ట్రిబ్యూటర్లు కోరారు. ఈ మూవీ ఇండియాతోపాటు ఓవర్సీస్ లోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్న విషయం తెలిసిందే.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్ మూవీ.. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.195 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గమనార్హం.అయితే ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కంటే కూడా సెకండ్ వీకెండే భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ముందు చెప్పినట్లే చిత్ర యూనిట్ ప్రతి టికెట్ పై రూ.5లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు.హనుమాన్ మూవీకి ఇప్పటివరకు 53,28,211 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వాటి నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు హనుమాన్ మూవీ నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పటికే హనుమాన్ ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్ల నుంచి రూ.14,85,810 చెక్కును అందజేశారు.అయోధ్య రామ మందిరానికి రూ. 2 కోట్లుకుపైగా విరాళం ఇస్తున్నట్లు తాజాగా హనుమాన్ మూవీ టీమ్ పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ న్యూస్‌తోపాటు ఆ పోస్టర్ వైరల్ అవుతోంది
Also Read
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!