Bus Accident: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్‌కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్‌గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Russian Missile Strike: ఉక్రెయిన్‌లోని స్లోవియన్స్క్‌పై రష్యా క్షిపణి దాడి.. 8 మంది మృతి
“రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడటంతో 13 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.” అని రాయ్‌గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు పక్కన అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు నిలిచిపోయాయి.