12 dead in China Coal Mine Accident: భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాలు ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో సంభవించిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంకు కారణం ఇంకా తెలియరాలేదు. చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. చైనా అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశం మాత్రమే కాదు.. అతి పెద్ద వినియోగ దేశం కూడా.
Also Read: Sanju Samson: గత రెండు నెలలుగా ఎంతో కష్టపడ్డా.. సంజూ శాంసన్ ఎమోషనల్!
ప్రకృతి వైపరీత్యాలు డ్రాగన్ కంట్రీ చైనాను తరచుగా అతలాకుతలం చేస్తున్నాయి. ముందుగా కరోనా వైరస్ మహమ్మారి చైనాను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత కరువు, వరదలు, భూకంపంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వివిధ ప్రమాదాలు ప్రజల మరణాలకు కారణం అవుతున్నాయి.