NTV Telugu Site icon

100 plastic surgeries: అలా కనిపించాలని 5 కోట్ల ఖర్చు చేసి 100 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న అమ్మాయి..!

14

14

ఓ యువతి తన రూపాన్ని తనకు ఎంతో ఇష్టమైన నటిలా కనిపించడానికి ఏకంగా 100 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. చైనా దేశానికి చెందిన ఈ బాలిక తన పదమూడవ ఏట నుంచి ఈ సర్జరీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక సర్జరీలు చేస్తున్న సమయం కారణంగా వాటికి సమయం కేటాయించడం కోసం ఆమె తన పాఠశాలను కూడా వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: No Tax Paid : టాక్స్ చెల్లించలేదని ప్రైవేట్ స్కూల్ కి తాళం వేసిన మున్సిపల్ అధికారులు..!

తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన బాలిక చెందిన ఝౌ చునా. ఈమెకు సుప్రసిద్ధ చైనా నటి ఎస్తేర్ యు అంటే ఆవిడకు చాలా ఇష్టం. దాంతో ఆమె అచ్చం అలా కనిపించాలని అందంగా ఉండాడానికి ఆ బాలిక తన 13వ ఏట నుంచి మొహానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది. అయితే ఈ సర్జరీలకి సంబంధించిన మొత్తం ఖర్చుని ఆవిడ తల్లిదండ్రులు భరించారు. ఈ విషయంపై ఆ బాలిక మాట్లాడుతూ.. తాను అందంగా కనిపించాలని ఉండడానికి ఇలా చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా తన లుక్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదని.. దానివల్ల తాను డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని తెలిపింది.

Also read: Family Star Trailer : ‘ఫ్యామిలీ స్టార్ ‘ ట్రైలర్ వచ్చేసింది.. ఆ ఒక్కటి హైలెట్ బాసూ..

నిజానికి ఆ అమ్మాయి తల్లి చాలా అందంగా ఉండేది. కాకపోతే తాను చిన్నతనంలో అందంగా లేనని.. వారి బంధువులు, కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకి మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పుకొచ్చింది. అలాగే చిన్న వయసులో ఒకసారి షాంఘైలోని చదివే రోజులలో ఓ పాఠశాలకు హాజరైన సమయంలో.. తన తోటి విద్యార్థులు తన కంటే అందంగా ఉన్నారని., అలాగే వారు ఆత్మవిశ్వాసంతో కూడా ఉన్నారని తెలిపింది. దాంతో ఆమె తన అందాన్ని ఎలాగైనా మెరుగుపరచుకోవాలని ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది.