Warangal: పదినెలల చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న ఒక చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో ఆదివారం ఉదయం వేకువజామున జరిగింది. బదావత్ మాలు-కవిత దంపతులకు ఏడాది వయసున్న మణికంఠ అనే బాబు ఉన్నాడు. మణికంఠ తండ్రి అయ్యప్పమాల వేసుకున్నాడు. దీంతో ఇంట్లో నిత్యం పూజలు, దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చేస్తున్నారు. ఇక మాల వేసుకున్నవారు ఇంట్లో ఉంటే మహిళలకు విపరీతమైన పని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదినెలల చిన్నారి ఏడుస్తుంటే ఊరడించడానికి తల్లి.. చిన్నారికి కొబ్బరి ముక్క చేతిలో పెట్టింది. దీంతో ఆ బాలుడు ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉండగా.. ఒక్క సారిగా ఆ గొంతులో అడ్డుపడింది. దీంతో ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే చిన్నారి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
Also Read
ఇటీవలే తండ్రి చాక్లెట్ ఇవ్వడంతో అదికాస్త గొంతులో చిక్కుకుని చిన్నారి మృతి చెందాడు. నవంబర్ 27న ఇలాంటి ఘటనే పిన్నవారి వీధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి సందీప్ తండ్రి ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అక్కడినుంచి పిల్లల కోసం చాక్లెట్లు తెచ్చాడు. ఆ చాక్లెట్ ను స్కూలుకు తీసుకువెళ్లిన చిన్నారి.. తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. మరో ఘటనలో ఓ వ్యక్తి మాంసాహారం భుజిస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా అది వెలికి రాలేదు. దీంతో ఊపిరి ఆడక అతను మరణించాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు