Site icon NTV Telugu

Mexico Bar Shooting: బార్‌లో కాల్పులు.. 10 మంది దుర్మరణం

Mexico

Mexico

Mexico Bar Shooting: మెక్సికోలు కాల్పులు కలకలం రేపాయి. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలోని ఒక బార్‌లో జరిగిన దాడిలో పది మంది వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. రాత్రి 11:00 గంటల తర్వాత దాడి జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం “ఎల్ ఎస్టాడియో” బార్‌లో సెలయా, క్వెరెటారో నగరాలను కలిపే హైవే వెంబడి బార్‌లోని కస్టమర్‌లు, ఉద్యోగులపై సాయుధులైన వ్యక్తుల బృందం విరుచుకుపడి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Stray Dogs: దేశ రాజధానిలో విషాదం.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం

గ్వానాజువాటో సంపన్నమైన పారిశ్రామిక ప్రాంతం, మెక్సికోలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఇది దేశంలో అత్యంత రక్తపాత రాష్ట్రంగా మారింది. శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూవా జెనరేసియన్ అనే ఇద్దరు కార్టెల్‌లు రాష్ట్రంలో ఘోరమైన టర్ఫ్ యుద్ధాలతో పోరాడుతున్నారు. ఇక్కడ వారు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇంధన దొంగతనాలకు ప్రసిద్ధి చెందారు.

Exit mobile version