Site icon NTV Telugu

Train Derailed: పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు

Train

Train

పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం, ఒక ప్యాసింజర్ రైలులోని 4 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో, ఒక ప్రయాణీకుడు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ రైలు పెషావర్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read:Tollywood Bundh : బంద్ పై మెగా పంచాయితీ.. తీర్పు ఆమోదయోగ్యంగా ఉంటుందా?

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడని వారిని ఆసుపత్రికి తరలించారు. లోధ్రాన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లుబ్నా నజీర్ ప్రకారం, మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం తర్వాత, ఈ మార్గం కొన్ని గంటల పాటు మూసివేశారు. ట్రాక్ పునరుద్దరణ తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.

Exit mobile version