Site icon NTV Telugu

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్‌ తీసుకువచ్చినా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అతి వేగం, మద్యం సేవించి.. వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయ్‌. ఈప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయ్‌. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు వెళుతుండగా ఇసుక బస్తాలను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version