Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Zohran Mamdani Modi And Netanyahu Are The Same Mamdanis Blatant Lies About Gujarat Muslims

Zohran Mamdani: మోడీ, నెతన్యాహూ ఒకటే.. గుజరాత్ ముస్లింల గురించి మమ్దానీ అడ్డగోలు అబద్ధాలు..

Published Date :June 27, 2025 , 5:19 pm
By BV Reddy
  • న్యూయార్క్ మేయర్ పీఠం వైపు జోహ్రాన్ మమ్దానీ..
  • ప్రధాని నరేంద్రమోడీపై మమ్దానీ ఆరోపణలు..
  • పాత వీడియో ప్రస్తుతం వైరల్..
  • గుజరాత్ ముస్లిం గురించి అడ్డగోలు అబద్ధాలు..
Zohran Mamdani: మోడీ, నెతన్యాహూ ఒకటే.. గుజరాత్ ముస్లింల గురించి మమ్దానీ అడ్డగోలు అబద్ధాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Zohran Mamdani: భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసు ఉన్న ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధిస్తే, అమెరికాలో అతిపెద్ద నగరానికి తొలి ముస్లిం మేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అయితే, గతంలో మమ్దానీ భారత్, భారత ప్రధాని నరేంద్రమోడీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతీయులతో పాటు చాలా మంది అతడి కామెంట్స్‌ని తప్పుబడుతున్నారు.

2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోడీపై ఆయన విమర్శలు చేశారు. ముస్లింలను తన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి నిర్మూలించారని ఆరోపిస్తున్న పాత వీడియో మళ్లీ వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై భారతీయుల నుంచే కాకుండా, ఇండో అమెరికన్ కమ్యూనిటీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో మమ్దానీ మాట్లాడుతూ.. 2002 అల్లర్లలో చాలా మంది మరణించారని, మనం ఇంకా ఉనికిలో ఉన్నామని కూడా ప్రజలు నమ్మడం లేదని అన్నారు.

Read Also: Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో ‘‘మూడో మెట్టు’’ రహస్యం.. ఈ మెట్టుపై భక్తులు కాలు పెట్టరు..

మేయర్ ఎన్నికలకు ముందు జరిగిన అభ్యర్థుల ఫోరమ్‌లో, మేయర్ అభ్యర్థులు న్యూయార్క్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి కనిపిస్తారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పోల్చాడు. మోడీని నెతన్యాహూలాగే యుద్ధ నేరస్తుడిగా చూడాలని కోరాడు.

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని మోడీకి, ఇతరులకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, గుజరాత్‌లో కొద్ది మంది ముస్లింలు మాత్రమే మిగిలి ఉన్నారని మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ జనాభా లెక్కల ప్రకారం, 2011లో రాష్ట్ర జనాభాలో 10 శాతం ముస్లింలు ఉన్నారు. 2002 అల్లర్ల తర్వాత కూడా వీరి జనాభా పెరిగింది. రాజకీయ విశ్లేషకుడు ఒమర్ ఘాజీ మాట్లాడుతూ.. మమ్దానీ వ్యాక్యలు రెచ్చగొట్టేవిగా, తప్పుడువిగా ఉన్నాయని, ఇది గుజరాత్‌లోని 6 మిలియన్ల ముస్లిం జనాభా, వారి ఉనికిని తిరస్కరించేలా, అవమానించేలా ఉన్నాయని అన్నారు.

Zohran Mamdani, son of filmmaker Mira Nair, is an immigrant, socialist, and now NYC mayoral nominee. He once called Narendra Modi a “war criminal” over the 2002 Gujarat riots. He is a rare politician who doesn't mince words, locally or globally.#Emergency #Emergency1975 pic.twitter.com/GcNCV0kyL7

— Adv. Vijay Singh (@VijaySingh_law) June 25, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2002 Gujrat Riots
  • Benjamin Netanyahu
  • Gujarat Muslims
  • new york city
  • New York Mayor

తాజావార్తలు

  • Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?

  • New Rules for Coaching Centers: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే అంతే..!

  • CM Revanth Reddy: “ఇది శివదీక్ష.. ఎవ్వరూ ఆపలేరు”.. మూసీ ప్రాజెక్టు అడ్డుకునే వారికి సీఎం స్ట్రాంగ్ కౌంటర్!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్‌తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!

ట్రెండింగ్‌

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions