కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్ ఇండియాను భయపెడుతున్నది. కరోనాతో ఇప్పటికీ అతలాకుతలం అవుతున్న కేరళను జికా వైరస్ దడ పుట్టిస్తున్నది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 13 అనుమానిత జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణేలోని వైరాలజీ సంస్థకు తిరువునంతపురం నుంచి 21 శాంపిల్స్‌ను పంపగా అందులో 13 శాంపిల్స్‌లో జికావైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ ప్రభుత్వం వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.
Read: “మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్
ఏడెస్ అనే దోమల కారణంగా జికా వైరస్ మనుషులకు సోకుతున్నది. ఈ వైరస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, దోమ కుట్టడం వలన మనిషి డెంగ్యూ వంటి లక్షణాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ జికా వైరస్ కు మందులు లేకపోవడంతో ఆందోళనలు కలుగుతున్నాయి. పగటిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి నివారణ మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.
