ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో ఎక్కడొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూరీలోని బలిహరచండి ఆలయం సమీపంలో ఒక జంట ఏకాంతంగా గడుపుతున్నారు. ముగ్గురు దుండగులు రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ప్రియుడిని బెదిరించి.. 19 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని బీచ్ సమీపంలోకి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్‌లో కీలక ట్విస్ట్.. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ ఏం చేసిందంటే..!
బ్రహ్మగిరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బలహరచండి ఆలయం సమీపంలో మధ్యాహ్నం సమయంలో విద్యార్థిని తన సహచరుడితో ఏకాంతంగా ఉండగా స్థానిక యువకుల బృందం రహస్యంగా వీడియోలు.. ఫొటోలు తీసి బెదిరించారని పోలీసులు తెలిపారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే పబ్లిక్ చేస్తామంటూ బెదిరించారని.. అంతలోనే యువతిపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tragedy: ఎంత ప్రేమో.. అన్నయ్య మరణం తట్టుకోలేక చెల్లి కూడా..
ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశామని.. ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తుందని.. ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే యువతిపై ఇద్దరు యువకులు మాత్రమే అత్యాచారం చేసినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు.
