ఫోన్​లో వాగ్వాదం.. యువ వైద్యుల జంట ఆత్మహత్య

డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల జంట ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యులైన నికిల్​ షేండకర్​(27), అంకిత నికిల్​ షేండకర్​(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత మానసిక వైద్యురాలు కాగా.. నికిల్​ ఆయుర్వేద వైద్యుడిగా చేస్తున్నాడు. ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వహించుకుని వస్తుండగా ఫోన్​లో వాగ్వాదం చేసుకున్నారు. దీంతో నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత మృతిని చూసిన భర్త అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.