NTV Telugu Site icon

Pragyananda Meet PM: ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద

Pragyananda

Pragyananda

Pragyananda Meet PM: దేశంలో ఈ మద్య కాలంలో యువత చదువుతోపాటు ఇతర వాటిల్లోనూ రాణిస్తున్నారు. ఇలా చిన్న వయస్సులోనే చెస్‌లో ప్రజ్ఙానంద అత్యంత ప్రతిభ కనబరిచారు. భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భారత యువత ఏ రంగంలోనైనా ఢంకా బజాయిస్తుందనడానికి ఉదాహరణగా ప్రజ్ఞానంద నిలుస్తారంటూ మోడీ మెచ్చుకున్నారు. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని నరేంద్ర మోడీని గౌరవ సూచకంగా కలుసుకున్నారు. అత్యంత పిన్న వయసుకుడైన భారతీయ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. అతను తల్లిదండ్రులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఆయనతో కాసేపు మాట్లాడారు. మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని ప్రజ్ఞానందతో ప్రధాని మోడీ అన్నారు. ఇటీవల జరిగిన చెస్ ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకున్నాడు యువ ఆటగాడు ప్రజ్ఞానందా. చెన్నైకి చెందిన ఈ ప్రతిభావంతుడైన యువ ఆటగాడు.. టైటిల్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సెన్ తో పోటీపడి ఓడిపోయాడు. ఈ ప్రపంచ టోర్నమెంట్లో రన్నరప్ గా నిలిచాడు.

Read Also: Jamili election: జమిలి ఎన్నికలు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ!

ప్రధానిని కలిసిన తర్వాత ప్రజ్ఞానంద ఈ విషయాన్ని ట్విట్టర్లో తానే స్వయంగా షేర్ చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలవడం గొప్ప గౌరవం. నన్ను, నా తల్లిదండ్రులను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆ ఫోటోలు షేర్ చేశాడు ప్రజ్ఞానంద. ఇక్కడ ప్రజ్ఞానంద చేసిన ట్వీట్‌ను ప్రధాని మోడీ షేర్ చేస్తూ .. ఈ గౌరవం మీ అభిరుచిని, పట్టుదలను తెలుపుతుందని.. భారత యువత ఏ రంగంలోనైనా ఎలాంటి విజయాలు సాధించగలదో చెప్పడానికి మీరు ఉదాహరణగా నిలుస్తున్నారని.. మిమ్మల్ని చూసి మేము గర్వంగా ఉన్నామంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. రన్నరప్‌గా నిలిచిన ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన ప్రతిభతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు గెలుచుకోవడమే కాకుండా.. ప్రజ్ఞానందా కనపరచిన ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్ధుడై బహుమతిగా కారును కూడా ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులైన రమేష్ బాబు, నాగలక్ష్మిలకు ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు వారికి రెండు రోజుల క్రితం కారును అందజేశారు.