Site icon NTV Telugu

Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్లు ప్యాంటు తడుపుకుంటున్నారు.. యూపీలో నేరాలకు ఛాన్స్ లేదు..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కిీలక వ్యాఖ్యలు చేశారు. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ ను ఇటీవల కోర్డు దోషిగా తేల్చి యావజ్జీవం విధించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల తర్వాత యోగి శనివారం మాట్లాడుతూ..దోపిడీ బెదిరింపులు మరియు అపహరణలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు కోర్టులు శిక్షించిన తర్వాత ప్యాంట్లు తడుపుకుంటున్నారని అన్నారు.

గోరఖ్ ఫూర్ లో బాటిలింగ్ ఫ్లాంటుకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో గుండాలు, మాఫియాలు వ్యాపారులను బహిరంగంగా బెదిరించి కిడ్నాపులకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారని, ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో నేరాలకు ఛాన్స్ లేదని ఆయన అన్నారు. కోర్టులు వాళ్లకు శిక్ష విధించే సమయంలో ప్యాంట్లు తడి చేసుకుంటున్నారని, ప్రజలు ఇదంతా చూస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ పనితీరుతో యూపీలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేదని అన్నారు. బతికేందుకు నేరస్తులు పరిగెడుతున్నారని అన్నారు.

Read Also: Madhya Pradesh: అన్నా చెల్లెల క్యారెక్టర్‌పై అనుమానం.. చెట్టుకు కట్టేసి అమానుషం..

రామ నవమి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది రామ నవమి వేడుకల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు జరిగినప్పుడు, యూపీలో శాంతి నెలకొంది అని అన్నారు. రాముడి జన్మస్థలం అయోధ్యను ముప్పై మూడు లక్షల మంది సందర్శించారని, 1000 కన్నా ఎక్కువ ఊరేగింపులు జరిగాయని కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని యోగి అన్నారు. బదులుగా హిందువులు, ముస్లింలు ఊరేగింపులపై పూల వర్షం కురిపించారని తెలిపారు.

మల్టీ నేషనల్ కంపెనీ పెప్సీకో ప్రాంఛైజీ అయిన వరుణ్ బేవరేజెస్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గోరఖ్ పూర్ లింక్ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్ లో రూ.1,071 కోట్లతో ఈ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ప్లాంట్ సిద్ధమయ్యే సమయానికి గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే కూడా పూర్తవుతుందని, నేపాల్, బీహార్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ వరకు ఫోర్-లేన్ కనెక్టివిటీ అందించబడుతుందని యోగి అన్నారు.

Exit mobile version