Bajinder Singh: ‘‘యేషు యేషు పాస్టర్’’గా ప్రసిద్ధి చెందిన బజిందర్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా కోర్టు నిర్ధారించింది. స్వయం ప్రకటిత క్రైస్తవ పాస్టర్‌గా అందరికి తెలిసిన ఇతడిపై 2018లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో శుక్రవారం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఇతడికి శిక్ష పరిమాణాన్ని ఏప్రిల్ 1న ప్రకటించనుంది. పంజాబ్‌కి చెందిన 42 ఏళ్ల బజిందర్ సింగ్, 2018లో జిరాక్‌పూర్‌కి చెందిన ఒక మహిళను విదేశాలకు వెళ్లడానికి సాయం చేస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు నిర్దోషులుగా విడుదలయ్యారు.
కేసు వివరాలను పరిశీలిస్తే, ఫిబ్రవరిలో బజిందర్ సింగ్‌పై 22 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించాడనే అభియోగం నమోదైంది. సదరు మహిళ తన తల్లిదండ్రులతో కలసి 2017 అక్టోబర్‌లో బజిందర్ సింగ్‌కి చెందిన చర్చికి వెళ్లడం ప్రారంభించింది. విదేశాలకు వెళ్లడానికి సాయం చేస్తానని తనను ప్రలోభపెట్టినట్లు మహిళ ఆరోపించింది.
Read Also: Gaza: గాజాలో తీవ్రమైన నిరసనలు.. “హమాస్” తమ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆందోళన..
బజిందర్ సింగ్ మహిళ నంబర్ తీసుకుని మేసేజులు చేయడం ప్రారంభించాడు. సింగ్‌కి భయపడిన మహిళ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. పాస్టర్ తనను ఆదివారాల్లో చర్చిలోని క్యాబిన్ ఒంటరిగా కూర్చోబెట్టాడని, పాస్టర్ తనను కౌగిలించుకోవడంతో పాటు అనుచితంగా తాకేవాడని ఆమె ఆరోపించింది. తనపై ఫిర్యాదు చేస్తే, తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించే వాడని బాధితురాలు ఆరోపించింది.
ఇటీవల, ఓ మహిళను చెంపదెబ్బ కొట్టడం వైరల్ అయింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో ఊగిపోయిన అతను మహిళపైకి నోట్‌బుక్ విసిరాడు. హర్యానాలోని జాట్ కుటుంబంలో జన్మించిన సింగ్, 10 ఏళ్ల క్రితం క్రైస్తవాన్ని తీసుకున్నాడు. అతడు జలంధర్, మొహాలిలో చర్చిలను నడుపుతున్నాడు. ఇతడికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.