NTV Telugu Site icon

బ్లాక్‌మెయిల్‌.. రెండేళ్లుగా మహిళపై సామూహిక లైంగిక దాడి..

worst incident

worst incident

ఆడవాళ్లపై లైంగికదాడుల కేసుల్లో కొత్త కొత్త తరహా ఘటలు వెలుగు చూస్తుంటాయి.. పసిగొడ్డు నుంచి వృద్ధురాలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తోంది.. మహిళకు చెందిన ఓ అస్యకరమైన వీడియో దొరకడంతో.. ఆ వీడియో చూపిస్తూ.. రెండేళ్లుగా.. ముగ్గురు యువకులు 20 ఏళ్ల మహిళలను చిత్ర హింసలకు గురిచేశారు.. వారికి కావాల్సినప్పుడల్లా.. ఆమె కోరికి తీర్చాల్సిందే.. లేదంటే.. వీడియో బయట పెడతామని బ్లాక్‌ మెయిల్‌.. కొన్నిసార్లు సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు గోడు వెల్లబోసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని అళ్వార్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మహిళకు సంబంధించిన ఓ అసభ్యకరమైన వీడియో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులకు రెండేళ్ల క్రితం దొరకింది.. అదే అదునుగా భావించిన ఆ కామాంధులు.. ఆ వీడియో చూపించి బయపెడుతూ సామూహిక అత్యాచారం చేశారు. ఆ వీడియోను బయటపెడతామని బెదిరింపులకు గురిచేస్తూ.. గత రెండేళ్లుగా ఆమెపై లాంగికదాడికి పాల్పడుతూనే ఉన్నారు.. రెండేళ్ల పాటు మౌనంగా ఆ మానవ మృగాల లైంగిక హింసను బరించిన ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.