NTV Telugu Site icon

Skin Looking Like Plastic: ప్లాస్టిక్‌లా మారిపోయిన ఓ మహిళ చర్మం.. కారణమేమిటో తెలుసా?

Skin Looking Like Plastic

Skin Looking Like Plastic

Skin Looking Like Plastic: విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అరుదైన సమస్యకు చోటుచేసుకుంది. 30 నిమిషాల పాటు ఎండలో నిద్రపోయిన 25 ఏళ్ల యువతి నుదిటి చర్మం ప్లాస్టిక్‌లా మారడంతో భయాందోళనకు గురైంది. ఈ ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది. బ్యూటీషియన్ అయిన సిరిన్ మురాద్ బల్గేరియాలో విహారయాత్రలో ఉండగా, సన్‌స్క్రీన్ లేకుండా 21 డిగ్రీల సెల్సియస్ సూర్యరశ్మితో బయట నిద్రపోయింది. 30నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ.. పట్టించుకోకుండా మళ్లీ సిరిన్‌ నిద్రలోకి జారుకుంది. అయితే, మరుసటి రోజు ఆమె చర్మం చాలా బిగుతుగా మారింది. ఆమె కనుబొమ్మలను తిప్పినప్పుడు అది ప్లాస్టిక్‌లా కనిపించింది. ఎండలో నిద్రపోవడమే దానికి కారణమని ఆమె భావిస్తోంది. కుటుంబసభ్యులతో ఈ విషయాన్ని చర్చించిన ఆమె, ఏం జరగదులే అని భావించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, రోజుల గడిచేకొద్దీ తన ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు ఆ యువతి పేర్కొంది. నొప్పితో బాధ, భయంవేసిందని తెలిపింది.

Delhi Excise Policy: ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్‌ను సస్పెండ్ చేసిన కేంద్రం

అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడంతో కోలుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయానని ఫేస్‌బుక్‌లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది. అప్పటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్‌బుక్‌లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది. మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు పేర్కొంది. ఆమె ప్రస్తుతం సన్‌స్క్రీన్ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. క్యాన్సర్ ఉన్నవారు ఎండలోకి వెళ్తే ఇలా జరగొచ్చని అభిప్రాయపడుతున్నారు.