ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళల బలహీనతను అడ్డంపెట్టుకుని కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిని నమ్మించి అగ్రి యూనివర్సిటీ సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో మరో అపశృతి.. ప్రారంభానికి ముందే కూలిన రోప్ వే
జవహర్‌లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఖాళీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తిల్వారా ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ఫోన్ నెంబర్ కనుగొని వైస్-ఛాన్సలర్ కార్యాలయానికి ఫోన్ చేసింది. యూనివర్సిటీలో పని చేస్తున్న క్లర్క్ దుర్గా శంకర్ సింగెరా (58), ప్యూన్ ముఖేష్ సేన్‌లతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని సింగెరా నమ్మబలికాడు. పత్రాలతో విశ్వవిద్యాలయానికి రమ్మని చెప్పాడు. దీంతో ఆమె మరుసటి రోజు పత్రాలతో యూనివర్సిటీకి వచ్చి సింగెరాను కలిసింది. వైస్-ఛాన్సలర్‌తో మాట్లాడిన తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని.. టచ్‌లో ఉండమని చెప్పాడు. దీంతో ఆమె ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేది.. ఈ క్రమంలో నగరంలో పలుమార్లు కలిశారు. నియామక ప్రక్రియ జరుగుతోందని.. త్వరలో ఇంటర్వ్యూ జరుగుతుందని హామీ ఇస్తూ వచ్చాడు.
ఇది కూడా చదవండి: CWC meeting: సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరైన శశిథరూర్.. వీడియోలు వైరల్
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం క్లర్క్, ఫ్యూన్ ఆమెను విశ్వవిద్యాలయానికి పిలిచి.. త్వరలో ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తుందని తెలిపారు. దీంతో యూనివర్సిటీలో ఉన్న తమ ఇంటికి రావాలని కోరారు. వారి మాటలు నమ్మి వెళ్లినందుకు ఇద్దరూ వంచించారు. గది లోపలికి తీసుకెళ్లాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు బెదిరించి యూనివర్సిటీ వెలుపల దింపి పంపేశారు. మౌనంగా ఉంటే ఉద్యోగం వస్తుందని.. లేదంటే రాదని వార్నింగ్ ఇచ్చారు. తాను మోసపోయానంటూ గ్రహించి కుటుంబ సభ్యులతో కలిసి అధర్తల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
