Sunroof: సన్‌రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో తెలిసే ఘటన చోటు చేసుకుంది. కొండపై నుంచి కారుపై రాయి పడి 43 ఏళ్ల స్నేహల్ గుజరాతీ అనే మహిళ మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. రాయి కారు సన్‌రూఫ్‌ను పగలగొట్టి, కారులో ఉన్న స్నేహల్‌పై పడింది. ఆమె అక్కడిక్కడే మరణించింది. ఈ సంఘటన మహారాష్ట్ర లోని తమ్హిని ఘాట్‌లో జరిగింది.
Read Also: Pregnant Job Scam: “నన్ను ప్రెగ్నెంట్ చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా”.. మహిళ బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..
పూణే నుంచి మాంగావ్‌కు వోక్స్‌వాగన్ వర్టస్ కారులో వెళ్తుండగా, ఒక పెద్ద రాయి కారుపై పడింది. రాయి సన్‌రూఫ్‌ను పగలగొట్టి, ప్యాసింజర్ సీటులో కూర్చున్న మహిళ తలపై పడింది. సన్‌రూప్ ఉండకపోయి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవనే మాటలు వినిపిస్తున్నాయి. చూడటానికి లగ్జరీగా అనిపించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఈ ఘటన రుజువు చేస్తోంది.
