NTV Telugu Site icon

Woman Kills Husband: శ్రద్ధా వాకర్ తరహాలో.. భర్తని చంపి, ముక్కలుగా చేసి..

Woman Killed Husban

Woman Killed Husban

Woman Killed Her Husband With Help Of Son In Delhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసు గురించి అందరికీ తెలిసిందే! పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోందని.. ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ఆమెను చంపి, మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు వాటిని ఆయా ప్రాంతాల్లో విసిరేశాడు. అదే తరహాలో ఒక వివాహిత తన భర్తను చంపేసి, మృతదేహాన్ని 22 ముక్కలు చేసింది. ఫ్రిజ్‌లో వాటిని దాచి, రోజుకు కొన్ని చొప్పున శరీర భాగాలను గ్రౌండ్‌లో పడేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ క్రైమ్‌లో తల్లికి కొడుకు సహాయం చేయడం. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో పూనమ్, అంజన్ దాస్ దంపతులు త్రిలోక్‌పురి రెసిడెన్సీలో నివసిస్తున్నారు. ఈ జంటకు దీపక్ అనే కొడుకు ఉన్నాడు. కట్ చేస్తే.. పూనమ్, అంజన్ దాస్‌ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కూడా వీరి మధ్య గొడవ జరగడంతో.. కోపాద్రిక్తురాలైన భార్య, తన కొడుకుతో కలిసి భర్తను చంపేసింది. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాలో తెలియక.. 22 ముక్కలు చేశారు. వాటిని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. రోజుకు కొన్ని చొప్పున భాగాలను.. గ్రౌండ్‌లో పడేస్తూ వచ్చారు. ఈ బాడీ పార్ట్స్‌ను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వాళ్లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా.. నేరస్తుల్ని గుర్తించారు. బాడీ పార్ట్స్‌ని దీపక్ బ్యాగులో తీసుకెళ్లే దృశ్యాలు ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి.

నిందితుడు దీపక్‌ని పట్టుకోవడం కోసం.. స్థానికంగా ఉన్న చాంద్ థియేటర్ వద్ద ఒక పోలీసు బృందం సెటప్ ఏర్పాటు చేసింది. దీపక్ అక్కడికి రాగానే.. అతడ్ని అరెస్ట్ చేశారు. అతడు మొత్తం విషయాలను తెలపడంతో.. పూనమ్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అందుకే తాను భర్తను చంపేశానని పోలీసుల విచారణలో ఆమె తెలిపింది.

Show comments