NTV Telugu Site icon

Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!

Xae

Xae

ఓ మహిళా డ్రైవర్ ఏమరపాటుగా కారు పార్కింగ్ చేస్తుండగా ఊహించని రీతిలో విపత్తు ఎదురైంది. చూస్తుండగానే 30 మీటర్ల గుంటలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 70 రహదారులు మూసుకుపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోలన్‌లో సోమవారం ఉదయం వాహనాన్ని రివర్స్‌ చేస్తుండగా కారు 30 మీటర్ల గుంతలో పడటంతో ఓ మహిళా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మహిళ కారును పార్క్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు చేతకాకపోవడంతో గుంటలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు కారు వైపు పరిగెత్తి రక్షించే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కాలు, చేతికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతోంది. ఈ సంఘటన గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: Anant-Radhika wedding: స్టార్‌ హోటళ్లకు కాసుల వర్షం.. అమాంతంగా పెంచేసిన ధరలు..!

Show comments