Site icon NTV Telugu

రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ మృతి

దేశ రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి కోవింద్‌ ఉత్తరప్రదేశ్ పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్ ట్రాఫిక్ ను నిలిపివేసారు పోలీసులు. అయితే.. ఆ ట్రాఫిక్‌ లో చిక్కుకున్న ఓ మహిళ మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళను… ఆమె భర్త కారులో తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఆ మహిళ కరోనా నుంచి కోలుకుందని సమాచారం.

read also :తెలంగాణ పీసీసీగా రేవంత్‌… సింహాం అంటూ వర్మ ట్వీట్

అయితే మహిళ మృతి చెందిన విషయం తెలిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు కాన్పూర్ పోలీస్ కమిషనర్.. మహిళ అంత్యక్రియల్లో పాల్గొని.. ఆ కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కాగా… మృతి చెందిన మహిళ ఓ పారిశ్రామికవేత్తగా అని తెలుస్తోంది.

Exit mobile version